అల్పపీడనం.. ఏపీ, టీజీల్లో భారీ వర్షాలు

హైదరాబాద్: ఉత్తర వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనికి తోడు ఒరిస్సా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కోస్తాంధ్ర మీదుగా బలంగా కదులుతోంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్రలో పలు చోట్ల ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. వాతావరణ శాఖ అధికారులు శనివారం మీడియాతో మాట్లాడుతూ.. పశ్చిమ తీరం వెంబడి 45 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్య్సకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణ ప్రాంతంలోనూ ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇప్పటివరకు కోస్తాంధ్రలోని భీమునిపట్నంలో 8 సెంటీమీటర్లు, టెక్కలి, పాలకొండ, పలాస వంటి ప్రాంతాల్లో 4 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.