అలా చేస్తే.. చంద్రబాబుపై పోరాడుతా

ఏపీ సర్కారుపై పోరాటం చేస్తానని ట్విట్టర్ ద్వారా సీనీ నటుడు , జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇన్నాళ్లు మిత్రుడిగా ఉన్న చంద్రబాబుకు ఈ ట్వీట్ ద్వారా గట్టి హెచ్చరికే జారీ చేశారు. రాజధాని భూసేకరణ విషయంలో శుక్రవారం పవన్ ఘాటుగా స్పందించారు.

ఏపీ ప్రభుత్వం రాజధాని కోసం భూములు ఇవ్వని రైతుల మీద భూసేకరణ చట్టం ప్రయోగించనున్నట్లు హైకోర్టుకు తెలిపింది. ఆ ఉద్దేశంతో ముందుకెళితే మటుకు నేను రైతులకు అండగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని పవన్ హెచ్చరించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *