Breaking News

అర్హులైన వారందరికి వికలాంగుల ఫించన్లు మంజూరు…

అర్హులైన వారందరికి వికలాంగుల ఫించన్లు మంజూరు...

కరీంనగర్: సదరం సర్టిఫికెట్ తో వికలాంగుల ఫించన్ మంజూరుకు ధరఖాస్తు చేసుకున్న వారందరికి ఫించన్లు మంజూరు చేస్తామని జాయింట్ కలెక్టర్ బి. శ్రీనివాస్ అన్నారు. సోమవారం జిల్లా అధికారులతో కలిసి కలెక్టరేటు సమావేశ మందిరంలో డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇలందకుంట మండలం నుండి పద్మ మాట్లాడుతూ సదర్ సర్టిఫికెట్ ఉందని, ఫించన్ కోసం ధరఖాస్తు చేశానని, ఇంతవరకు రాలేదని తెలుపగా వెంటనే సదరం సర్టిపికెటుతో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్ధ కార్యాలయంలో ధరఖాస్తు ఇవ్వాలని, పరిశీలించి వెంటనే వికలాంగుల ఫించన్ మంజూరు చేస్తారని తెలిపారు. రామడుగు మండలం కాంతయ్య మాట్లాడుతూ బోర్ మంజూరుకు ధరఖాస్తు చేశానని ఇంతవరకు మంజూరు కాలేదని తెలుపగా ఆ మండలంలో బోర్ కు భూగర్భ జల శాఖ అనుమతితో మంజూరు చేస్తామని తెలిపారు. జమ్మికుంట మండలం మడిపల్లి నుండి శ్రీనివాస్ మాట్లాడుతూ 1981 లో భూమి కొనుగోలు చేసి రిజిష్ట్ర్రేషన్ చేయించుకున్నామని, సర్వే నెంబరు తప్పుగా నమోదు అయిందని తెలుపగా ఆర్టీఓకు అప్పీల్ చుసుకోవాలని సూచించారు. జమ్మికుంట మండలం కోరెపల్లి నుండి రాం రాజయ్య మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ 3 లక్షల నిధులు దుర్వినియోగం చేశారని, ఆదేశాలున్న చేయడం లేదని తెలుపగా, సర్పంచ్ నిధుల రికవరీపై కోర్టు నుండి స్టే తెచ్చారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి, ఆయేషా మస్రత్ ఖానం, డిఆర్ డిఓ వెంకటేశ్వరరావు, డిపిఓ నారాయణ రావు, జిల్లా పరిషత్ సిఇఓ పద్మజా రాణి ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *