Breaking News

అర్హులైన రైతులందరికీ.. ప‌ట్టాదారు పాసు బుక్కు పంపిణీ: మంత్రి ఎర్రబెల్లి

అర్హులైన రైతులందరికీ.. ప‌ట్టాదారు పాసు బుక్కు పంపిణీ: మంత్రి ఎర్రబెల్లి

అర్హులైన రైతులందరికీ.. ప‌ట్టాపాసు బుక్కు.

ప్రాజెక్టుల పూర్తితో ప్రతిపక్షాలు గల్లంతు.

— మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు వెల్ల‌డి.

జ‌న‌గామ జిల్లా:  క‌బ్జాలో ఉండి, సాగుచేసుకునే రైతులంద‌రికి ప‌ట్టాపాసు బుక్కులు అందజేయాల‌ని రెవెన్యూ అధికారుల‌ను ఆదేశించిన పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖామంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు.
మంగ‌ళ‌వారం ఉద‌యం పాల‌కుర్తి మండ‌ల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాల‌యంలో 475 పట్టాదారు పాసుబుక్కులు, 217 లావ‌ణి పట్టాలు, 123 క‌ళ్యాణ‌లక్ష్మి, షాధీముభార‌క్ చెక్కులను  మంత్రి ద‌యాక‌ర్‌రావు పంపిణీ చేశారు.

మంత్రి కామెంట్స్‌…

* రైతులు, క‌ళ్యాణ‌ల‌క్ష్మి ల‌భ్ధిదారుల నుండి లంచం అడిగితే జైలుకు పంపిస్తా.
* ర‌కాలు వ‌సూలు చేసిన ఘ‌న‌త కాంగ్రెస్ ది.. అవి మాఫీ చేసిన నాయ‌కుడు ఎన్టీఆర్‌, ఎదురుపెట్టుబడి పెట్టి ఆదుకున్న మ‌హానీయుడు మ‌న సియం కేసిఆర్‌ది.
* ఎంత ఖ‌ర్చు అయినా.. ప్ర‌తి ఎక‌రాకు సాగునీరు అందించ‌డానికి కృషి.
* తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులు పూర్తైతే  ప‌ట్ట‌గ‌తులు ఉండ‌వ‌నే  కాంగ్రెస్‌, బిజేపిల విమ‌ర్శ‌లు.
* రైతు బంధు, రైతు భీమా ప‌థ‌కాలను ప్ర‌వేశ‌పెట్టి రైతుల‌ను ఆదుకున్న నాయ‌కుడు మ‌న సియం.
* కాంట్రాక్ట‌ర్ నిర్ల‌క్ష్యంతోనే పాల‌కుర్తి ప్రాంతంలోని రిజ‌ర్వాయర్ల ప‌నులు న‌త్త‌న‌డ‌క‌న న‌డుస్తున్నాయి.
* మూడు నెలల్లో పూర్తి చేసి.. ఈ ప్రాంతాన్ని స‌స్య‌శామ‌లం చేస్తాం.
* రైతుకు అన్యాయం జ‌రుగ‌ద్దు, రాజకీయాల‌కు అతీతంగా ప‌ట్టాదారు పాసు బుక్కుల పంపిణీకి అంద‌రూ స‌హాక‌రించాలి.
* త్వ‌ర‌లోనే రైతుల‌కు ల‌క్ష రూ.ల రుణ‌మాఫి.
* పేదింటి ఆడ‌బిడ్డ‌ల‌కు మేన‌మామ‌గా కేసిఆర్.
* క‌ళ్యాణ‌ల‌క్ష్మి, షాధీముభార‌క్ ప‌థ‌కాల అమ‌లు.

errabelli dayakar rao 1     errabelli dayakar rao 2     errabelli dayakar rao 3     errabelli dayakar rao 4     errabelli dayakar rao 5     errabelli dayakar rao 6

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *