అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు : మంత్రి కేటీఆర్ ఆదేశం

రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికి వెంటనే అక్రెడిటేషన్ కార్డులు వెంటనే మంజూరీ చెయ్యాలని మంత్రి కేటిఆర్ ఆదేశించారు . అక్రెడిటేషన్ల కోసం జర్నలిస్టులకు సమాచార శాఖ సవాలక్ష ఆంక్షలు విధిస్తున్న క్రమంలో ఇటీవలే రాష్ట్ర అక్రెడిటేషన్ కమిటీ సమావేశాన్ని బహిష్కరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సచివాలయంలోని తన చాంబర్ లో బుధవారం సమాచార శాఖ కమీషనర్ నవీన్ మిట్టల్ తో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో టీయూడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె .విరాహత్ అలీ , హెచ్ యూ జే అద్యక్షులు కొటిరెడ్డి పాల్గొన్నారు . ఈ సందర్బంగా అక్రిడిటేషన్ల కోసం రాష్ట్ర రాజధాని హైదరబాద్ లో , జిల్లాలలో జర్నలిస్టులు పడుతున్న కష్టాలను మంత్రి దృష్టికి తెచ్చారు . దీనిపై కేటీఆర్ స్పందిస్తూ ఆంక్షలు లేకుండా అర్హులైన వారందరికి కార్డులు మంజూరి చెయ్యాలని అదేశించారు. విద్యార్హతలతో సంబందం లేకుండ కార్డులు మంజూరిచేయ్యాలని, కొత్త జిల్లాలలో కాకుండ ఉమ్మడి జిల్లాలలో ప్రయాణించే విధంగా బస్ పాసులు మంజూరి చెయ్యాలని , స్టేట్ అక్రెడిటేషన్లకు ఎసి పాసులు ఇవ్వాలని, అర్హులైన ఆన్ లైన్ మీడియా జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని, చిన్న, మద్యతరగతి పత్రికలపై విధించిన ఆంక్షలను సవరించాలని మంత్రి అదేశించారు. తక్షణమే అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి తగు చర్యలు చెప్పట్టాలన్నారు. అలాగే హెల్త్ కార్డులకు సంబందించిన విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లగా , వెంటనే కమిటీ ఏర్పటు చేసి పాతకార్డులు సక్రమంగా అమలుచేయడం తో పాటు కొత్త కార్డుల జారీకి చర్యలు చేపట్టాలని కెటిఆర్ ఆదేశించారు.

జర్నలిస్టుల అక్రిడిటేషన్ ల పట్ల సానుకూలంగా స్పందించి, రాష్ట్ర్రంలో అర్హులైన జర్నలిస్టులందరికి అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయాలని సమాచార శాఖ కమీషనర్ నవీన్ మిట్టల్ ను ఆదేశించిన మంత్రి కేటీఆర్ కు తెలంగాణ ఆన్ లైన్ మీడియా జర్నలిస్టు వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర్ర అధ్యక్షులు అయిలు రమేష్ ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.

About The Author

Related posts