అర్హులందరికీ ఇండ్ల మంజూరు

కరీంనగర్ (పిఎఫ్ ప్రతినిధి): రాష్ర్టంలో అర్హులైన పేదవారందరికీ ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టింస్తుందని పార్లమెంటు సభ్యులు బి వినోద్ కుమార్ అన్నారు. కరీంనగర్ శాసన సభ్యులు గంగుల కమలాకర్ తో కలిసి డబుల్ బెడ్ రూం పథకానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని రాజకీయాలకు తావు లేకుండా అర్హులైన పేదవారిని గుర్తించి వారికే ఇండ్లను మంజూరు చేయనున్నట్లు తెలిపారు. జయదశమి పర్వదినాన ఈ పథకాన్ని ప్రారంభించి తెలంగాణ ఉద్యమంలో అమరుడైన కిష్టయ్య సతీమణి పద్మావతికి పథకంలో భాగంగా మొదటి ఇళ్లు కట్టించి ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మేయర్ రవీందర్ సింగ్, డ్వామా పిడి వైవి గణేష్, కార్పొరేటర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *