Breaking News

అర్ధరాత్రి తనిఖీలతో హడలెత్తిస్తున్న పోలీసులు

CARDEN-SEARCH-02-624x499

హైదరాబాద్ , ప్రతినిధి : హైదరాబాద్ లో అర్థరాత్రి తనిఖీలతో పోలీసులు నేరస్థులను బెంబేలెత్తుతున్నారు. క్రైం రేటును తగ్గించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మంగళవారం రాత్రి హైదరాబాద్ సైదాబాద్ లోని సింగరేణి కాలనీ, ఇటు జూబ్లీహిల్స్ లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు జరిపారు.

సింగరేణి కాలనీలో అక్రమంగా నిల్వఉంచిన 136 సిలిండర్లు, 11 వేల గుడుంబా ప్యాకెట్లు, 15 గ్యాస్ ఫిల్లింగ్ సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమానితులుగా కనిపించిన 18 మందిని అదుపులోకి తీసుకున్నారు. వెస్ట్ జోన్ లో 8 మంది రౌడీ షీటర్లు, ఇద్దరు మహిళలతో పాటు 20 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు.

కాగా నేరస్థులు ఉన్నారనే పక్కా సమాచారంతో దాడులు నిర్వహిస్తున్నామని.. అర్థరాత్రిపూట కార్డెన్ సెర్చ్ వల్ల నేరస్థులు పోలీసులకు చిక్కుతున్నారని నగర కమిషనర్లు తెలిపుతున్నారు. తనిఖీలను మున్ముందు కూడా కొనసాగింది., తీవ్రవాదాన్ని, ఉగ్రవాదుల్ని లేకుండా చేస్తామని హెచ్చరించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *