
మాదాసు శ్రీనివాస రావు అర్జున అవార్డు గ్రహిత, ప్రస్తుతం పార ఒలంపిక్స్ ఆఫ్ ఇండియా సభ్యులు సచివాలయం లో తెలంగాణ టూరిజం , క్రీడా శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ను కలసి వినతి పత్రం సమర్ఫించారు. ది వ్యాంగుడైన మాదాసు శ్రీనివాస రావు తన చాంబర్ వద్దకు వచ్చిన విషయం తెలుసుకోని మర్యాద పూర్వకంగా శ్రీనివాస రావు వద్దకు స్వయంగా వచ్చి వినతి పత్రం స్వీకరించి సానుకూలంగా స్పందించారు. కరీంనగర్ కు చెందిన శ్రీనివాస రావు దివ్యాంగుల విభాగంలో 2003 లో అర్జున అవార్డు ను సాదించారు. ప్రస్తుతం మూడు చక్రాల మోటరు వాహనం లేక బయటకు వెళ్లటానికి ఇబ్బంది పడుతున్నట్లు క్రీడా శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం కు
వివరించారు. మాదాసు శ్రీనివాస రావు కు అందించాల్సిన సహాయ సహాకారాలను అందించాలని క్రీడా శాఖ అధికారులను అదేశించారు.