అరెస్ట్ లు, నోటీసులకు టీ.ఏసీబీ రెడీ

ఓటుకు నోటు కేసు కీలక మలుపుతిరిగింది.. నిన్నంతా కీలక సంఘటనలు చోటుచేసుకున్నాయి. తెలంగాణ ఏసీబీ డీజీ ఏకే ఖాన్ సీఎంతో భేటి కావడం.. తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ, హైదరాబాద్ కమిషనర్ మహేందర్ రెడ్డి గవర్నర్ తో భేటి కావడంతో కథ మలుపు తిరిగింది. దీంతో ఏపీ సీఎం చంద్రబాబు, టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు నోటీసులు వెలువడబోతున్నాయంటూ ప్రచారం ఊపందుకుంది. దీంతో ఏపీ సీఎం చంద్రబాబు అత్యవసరంగా మంత్రులతో భేటి అయ్యారు. కీలక పరిణామాలపై చర్చించారు. నోటీసులు ఇస్తే ఏం చేయాలనే దానిపై ఆలోచించారు.

కాగా నోటీసులు అందినా తీసుకోకూడదని.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ఆలోచన లేదని చంద్రబాబు తన సహచరులకు సూచించినట్టు సమాచారం.

తెలంగాణ ఏసీబీ గవర్నర్ తో భేటి అనంతరం టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు నోటీసులు జారీ చేసింది. ఆయన ఇంటికెళ్లి వాటిని అందజేసింది. విచారణకు రావాలని కోరారు. అనంతరం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డికి విచారణకు రావాలని కోరగా.. రేపు ఉదయం వస్తానని ఆయన చెప్పారు. నోటీసులు జారీ చేసే వారందరూ దేశం విడిచి వెళ్లకుండా లుక్ అవుట్ నోటీసులు  జారీ చేయనున్నట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *