అరువొచ్చిన నేతలకే అందలమా.?

గులాబీ గూటిలో అసంతృప్తి మొదలైది. తెలంగాణ ఉద్యమం కోసం కష్టపడ్డ, జైలుకు వెళ్లిన వారికి సీఎం కేసీఆర్ ప్రాధాన్యం ఇవ్వడం లేదని.. అందరికీ వీఆర్ఎస్ ఇచ్చినట్టు పదవులకు దూరం పెట్టి పార్టీలోకి అరువు వచ్చిన నేతలను అందలం ఎక్కిస్తున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. శనివారం పూలే జయంతి సభలో శ్రీనివాస గౌడ్ తనకు మంత్రి పదవి రాకపోవడం అరువు నేతల కుట్ర అని మండిపడ్డారు. అగ్రనేతలకు పార్టీలో అందలం దక్కుతుందని నోరు విప్పారు. తెలంగాణ ఉద్యమకారుడికి కనీసం మంత్రి పదవి దక్కకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా ఇప్పటికే కిందిస్థాయి నాయకులు, కార్యకర్తల్లో ఇదే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కాంగ్రెస్ నుంచి ఇంద్రకరణ్ రెడ్డి, టీడీపీ నుంచి వచ్చిన తుమ్మల నాగేశ్వర రావు, తలసాని శ్రీనివాస యాదవ్ లు, లక్ష్మారెడ్డి, చందూలాల్ అనే వారు ఏనాడు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది లేదు.. కానీ టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే వారు పార్టీలో చేరడం.. కేసీఆర్ వారిని చేర్చుకోవడం.. మంత్రి పదవులు ఇవ్వడం జరిగిపోయాయి. దీంతో అప్పటి నుంచి మొదలైన అసమ్మతి ఇన్నాళ్లు సద్దుమనిగినా ఇప్పుడు శ్రీనివాస గౌడ్ రూపంలో తొలిసారి బయటపడింది. మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *