అరుణ్ జైట్లీతో చంద్రబాబు భేటి

chandra+jaitley_b

న్యూఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమయ్యారు. ఏపీ కి ప్రత్యేక హోదా విషయమై చర్చించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి వెళ్లిన ఆయన మంగళవారం ఉదయం అరుణ్ జైట్లీతో సమావేశమయ్యారు. ఏపీ ఆర్థిక సమస్యలపై సాయం చేయాలని కోరారు. వీలైనంత తొందరగా ప్రత్యేక హోదా అంశాన్ని పరిశీలించాలని కోరారు.  భేటి అనంతరం కేంద్ర మంత్రి సుజనాచౌదరి మీడియాతో మాట్లాడుతూ సాగునీటి, రహదారుల అంశాలపై చర్చించనున్నట్టు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు నిధుల కొరత లేకుండా చూస్తామని జైట్లీ అన్నట్లు ఆయన తెలిపారు. ఏపీ రాజధాని ని కలుపుతూ హైవేల నిర్మాణం చేపట్టనున్నట్లు సుజనా వెల్లడించారు. అంతకుముందు కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, ఉమాభారతిలను చంద్రబాబు కలిసి సమస్యలు విన్నవించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *