అరుణక్క మాటలు.. పద్మక్క ఏడుపులు

తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి కంటతడిపెట్టారు. మంగళవారం తెలంగాణ అసెంబ్లీ పరస్పర ఆరోపణలో అట్టుడికింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ ఉపసభాపతి పద్మాదేవేందర్ రెడ్డిని ఉద్దేశించి ‘సంస్కారం లేని వాళ్లు సభను నిర్వహిస్తున్నారంటూ’ నోరుజారారు.

దీనికి బాధపడి స్పీకర్ చైరులోనే పద్మాదేవేందర్ రెడ్డి కంటతడి పెట్టారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు జోక్యం చేసుకొని డీకే అరుణ వెంటనే సభకు, పద్మాకు క్షమాపణ చెప్పాలని.. లేకపోతే సభనుంచి సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. కాగా ఈ సమయంలో డిప్యూటీ స్పీకర్ పద్మానే హరీష్ రావును వారించి డికే అరుణ విజ్ఞతకే ఆమె వ్యాఖ్యలు వదిలేస్తున్నానంటూ అనడంతో సభ సజావుగా సాగింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *