
కేరళ , ప్రతినిధి : వేల సంఖ్యలో తెలంగాణ నుంచి పోయే అయ్యప్ప భక్తుల కష్టాలు తీరనున్నాయి. ఓ వ్యాపారవేత్త ఇంట పెళ్లికి హాజరైన తెలంగాణ సీఎం కేసీఆర్ కేరళ పర్యటన సక్సెస్ఫుల్గా ముగిసింది. కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీతో కేసీఆర్ సమావేశమయ్యారు. శబరిమలకు వచ్చే తెలంగాణ అయ్యప్ప భక్తుల కోసం వసతి భవనం నిర్మించేందుకు అనుమతి సాధించారు.
శబరిమలలో ఐదు ఎకరాల స్థలం ఇవ్వాలని చాందీకి విజ్ఞప్తి చేశారు. దీంతో సానుకూలంగా స్పందించిన కేరళ సీఎం.. కేసీఆర్ కోరినట్లుగా స్థలాన్ని కేటాయిస్తున్నట్లు తెలిపారు.