Breaking News

అయుతంలో అన్నీ తానైన హరీష్

20151227a_012134006 (1)

మెదక్ : పార్టీ కార్యక్రమాలైనా.. ప్రభుత్వ పథకాలైనా… అయుత చండీయాగమైనా.. ఆయన చేతిలో పడితే విజయం గ్యారెంటీ అన్న ముద్ర వేసుకున్న గెలుపు గుర్రం హరీష్ రావు.. అయుత చండీయాగంలో బహుముఖ పాత్ర పోషిస్తూ అందరి ఆదరాభిమానాలను చూరగొంటున్నారు..మొదటిరెండు రోజుల్లో సాధారణంగా వచ్చిన భక్తులు మూడోరోజు నుంచి పోటెత్తడంతో హరీష్ అయుత చండీయాగంలో భక్తుల ఇబ్బందులు, ట్రాఫిక్ చిక్కులను తీర్చేలా వ్యూహరచన చేశాడు.. మంత్రి అని పట్టించుకోకుండా భక్తుల క్యూలైన్ల వరకూ వెళ్లి వారికి సర్ది చెబుతూ ఎలాంటి ఇబ్బందులు కలుగ కుండా చూసుకున్నారు.. ఇక నాలుగోరోజైన శనివారం ఏకంగా సంప్రదాయ యాగ దస్తులు ఎర్రటి పంచె, వస్ర్తాలు కప్పుకొని మైకు చేత పట్టి హరీష్.. ‘నేను హరీష్ రావును మాట్లాడుతున్నా.. భక్తులరా స్వీయ నియంత్రణతో అమ్మవారిని దర్శించుకోండి’ అంటూ భక్తులకు సూచన చేస్తూ తోపులాటలు జరుగకుండా చూసుకున్నారు..

పోలీసులకు లక్షల మంది భక్తుల రాకతో ఒక దశలో నియంత్రణ సాధ్యం కాక చేష్టలుడిగిపోయిన పరిస్థితి తలెత్తింది.. ఈ క్రమంలో మంత్రి హరీష్ రావు రంగంలోకి దిగారు.. అన్నీ తానై ట్రాఫిక్ క్రమబద్దీకరిస్తూ భక్తులను సముదాయిస్తూ యాగశాల అంతా కాలినడకన తిరుగుతూ భక్తులకు మార్గనిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు భక్తుల కోసం మరిన్ని క్యూలైన్లు, వసతులు కల్పించి తోపులాటలు జరుగకుండా చర్యలు చేపట్టారు. భక్తుల బోజనాల కోసం రాత్రికిరాత్రే మరో భారీ భోజనశాలను నిర్మింపచేశారు..

కేసీఆర్ యాగశాల ప్రతినిత్యం పూజలో పాల్గొంటూ యాగశాల నిర్వహణ బాధ్యతలను హరీష్ కు అప్పజెప్పి ధీమాగా ఉండిపోయారు.. హరీష్ రంగంలోకి దిగితే వార్ వన్ సైడే అన్న సంగతి కేసీఆర్ కు తెలుసు కనుకే నిర్వహణను హరీష్ కు అప్పగించారు.. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా నెగ్గుకురాగల అల్లుడి నైపుణ్యానికి మామ కేసీఆర్ ముగ్ధుడవుతున్నాడట.. అయుత చండీయాగం ఘనవిజయం సాధించడంలో సీఎం కేసీఆర్ తో పాటు అందరికీ స్వాగత సత్కారాలు చేసిన హరీష్ ది కీ రోల్..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *