అయాచితం శ్రీధర్ ను అభినందించిన బీసీ కమీషన్

అయాచితం శ్రీధర్ ను అభినందించిన బీపీ కమీషన్

తెలంగాణ రాష్ట్ర్ర వ్యాప్తంగా గ్రంధాలయాలను సమర్ధవంతంగా తీర్చిదిద్దే బాధ్యతను అయాచితం శ్రీధర్ కు అప్పగించిన రాష్ట్ర్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు తెలంగాణ రాష్ట్ర్ర బీసీ కమీషన్ ఛైర్మన్ బి.ఎస్. రాములు అభినందనలు తెలియజేశారు. శనివారం నాడు ఖైరతాబాద్ లోని బీసీ కమీషన్ రాష్ట్ర్ర కార్యాలయంలో రాష్ట్ర్ర గ్రంధాలయ సంస్ధ ఛైర్మన్ అయాచితం శ్రీధర్ ను కమిషన్ ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా ఛైర్మన్ బి.ఎస్. రాములు మాట్లాడుతూ పరాయి పాలనలో గ్రంధాలయాలు జీర్ణావస్ధకు చేరుకున్నాయని, తెలంగాణ రాష్ట్ర్ర అవతరణతో అన్ని రంగాలతో పాటుగా గ్రంధాలయాలు కూడా జ్ఞానజ్యోతులుగా వెలుగొందనున్నాయని ఆయన ఆకాంక్షించారు. డిజిటల్ లైబ్రరీలు రూపకల్పన జరగాలని కోరారు. రాష్ట్ర్రంలోని ప్రతి రచయిత, ప్రతి కవి, ప్రతి సాహితీవేత్త పుస్తకాలు గ్రంధాలయ వ్యవస్ధ కొని, వారి రచనలనుయ ఆదరించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా బీసీ కమిషన్ సభ్యులు డా!! వకుళాభరణం కృష్ణమోహన్ రావు, డా!! ఆంజనేయ గౌడ్, జూలూరు గౌరిశంకర్ లు అయాచితం శ్రీధర్ ను ఘనంగా సన్మానించారు. తెలంగాణ రాష్ట్ర్ర తొలి గ్రంధాలయ పరిషత్ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించినందుకు ఆయనకు అభినందనలు తెలియజేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *