Breaking News

అమ్మ వైద్యం ఖర్చు 85 కోట్లు

అమ్మ’ వైద్యం ఖర్చు 80 కోట్లు!

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు 75 రోజుల పాటు చికిత్స అందించిన అపోలో ఆసుపత్రి వేసిన బిల్లెంతో తెలుసా?… అక్షరాల 85 కోట్ల రూపాయలు. అంటే రోజుకు కోటి రూపాయలకు పైగానే. స.హ చట్టాన్ని వినియోగించి ఓ సామాజిక కార్యకర్త అడిగిన ప్రశ్నతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే తమిళనాడు వైద్య ఆరోగ్య శాఖ ఈ బిల్లులో రూ.6 కోట్ల మొత్తం చెల్లించింది కూడా. ఆసుపత్రి ఖర్చంతటినీ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది.
జయలలితను ఆసుపత్రి రెండో అంతస్తులో ఉంచగా, అందులోని మిగతా గదులన్నీ ఖాళీ చేయించిన సంగతి తెలిసిందే. ఇక ఈ గదులన్నింటి అద్దెతో పాటు లైఫ్ సపోర్ట్ యాంత్రాల అద్దెలు, 39 మంది వైద్యులకు కన్సల్టేషన్ చార్జీలు, మందులు, లండన్ నుంచి పలుమార్లు వచ్చి వెళ్లిన డాక్టర్ రిచర్డ్ బిలే, అతని టీమ్ ఖర్చులు ఇలా చెప్పుకుంటూ పోతే బిల్లు జాబితా చాంతాడంత ఉంది. జయలలిత గుండె ఆగిన తరువాత అమర్చిన ఎక్మో అద్దె రోజుకు కోటి రూపాయలుగా అపోలో వేయడం గమనార్హం.
మొత్తంగా అమ్మ అనారోగ్యం.. అపోలో ఆస్పత్రికి వరంగా మారిందని, కాసుల పంట పండించిందని స్థానికులు చెప్పుకుంటున్నారు.
ఈ సమాచారాన్ని కోదాడ కు చెందిన PAPS సంస్థ సమాచార హక్కు చట్టం ద్వారా స౦పాదించింది. ఇంతవరకు అత్యంత వేగంగా సమాచారం పొందిన మొదటి పీటీషన్ ఇదే కావడం గమనార్హం.