
చైన్నై : అమ్మ భవితవ్యం తేలబోతోంది. ఆమె మళ్లీ జైలుకు వెళుతుందా.. లేక బెయిల్ దొరుకుతుందా? అనే ఉత్కంఠగా మారింది. ఆమె అభిమానులు, తమిళనాడు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తమిళనాడు మాజీ సీఎం జయలిలిత ఆదాయానికి మించి ఆస్తుల కేసులో కర్నాటక హైకోర్టు నేడు తుది తీర్పు వెలువరించనుంది. ఈ కేసులో ప్రత్యేక కోర్టు జయలలితకు నాలుగేళ్ల జైలు, రూ.100 కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే.. ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ జయలలిత కర్ణాటక హైకోర్టు ను ఆశ్రయించారు. ఈ కేసుకు సంబంధించి హైకోర్టు ఈ రోజు తీర్పు చెబుతోంది.