
తమిళనాడులో ఎన్నికలంటేనే అన్ని ఫ్రీ అన్న ప్రచారం నడుస్తోంది. అమ్మ, సీఎం జయలలిత కూడా అన్నీ ఫ్రీం అంటూ ప్రచారం నిర్వహించింది. ప్రతిపక్షంలో ఉన్న డీఎంకే అధినేత కరుణానిధి కూడా ఉచిత హామీలు గుప్పించారు. గడిచిన 5 ఏళ్లలో అమ్మ జయలలిత బాగానే పాలించారు. ఉచిత పథకాలు ఎన్నో ప్రవేశపెట్టారు. కానీ విజయం సాధించే అవకాశాలు లేవని తేలింది..
తమిళనాడు ఎన్నికలు ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. ఆశ్చర్యకరంగా అక్కడ అధికార అన్నాడీఎంకే ఓడిపోతుందని ఫలితాలు వెలువడ్డాయి. దీంతో జయలలిత మళ్లీ అధికారం కోల్పోవడం ఖాయం. డీఎంకే అధినేత కరుణ సీఎం కావడం ఖాయంగా కనపడుతోంది..
కాగా తమిళనాడులో ఓ వింత సంప్రదాయాన్ని అక్కడి ప్రజలు పాటిస్తున్నారు. ఏ పార్టీకి రెండోసారి అధికారం తమిళ ప్రజలు కట్టబెట్టరు.. 5 ఏళ్లు పాలించిన పార్టీని గద్దెదించి ప్రతిపక్షాన్ని గద్దెనెక్కిస్తారు. ఇలానే ఓ సారి జయలలిత, మరోసారి కరుణానిధి సీఎంలు గడిచిన 20 ఏళ్లుగా పంచుకుంటున్నారు. ప్రస్తుత సీఎం జయలలిత దిగిపోయి కరుణ సీఎం అవకాశాలు మెండుగా ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి.