
రాష్ట్ర వ్యాప్తంగా బోనాల పండుగ ఘనంగా జరిగింది. సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళికి సీఎం కేసీఆర్ పట్టు వస్త్రాలు సమర్పించి పూజలు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా బోనాల పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. కరీంనగర్ లో ఎమ్మెల్యే గంగుల, మేయర్ రవీందర్ సింగ్ లు, డివిజన్ల కార్పొరేటర్లు ఆయా డివిజన్ లలో బోనాల పండుగను నిర్వహించారు. అన్ని జిల్లాల్లో కూడా బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు.