
మెదక్ జిల్లాలో ఓ వింత చోటుచేసుకుంది. పుట్టుకుతోటే ఆడపిల్ల లా పెరిగి.. ఇప్పుడు 17 ఏళ్లు వచ్చాక అబ్బాయి అని తెలిసి ఆశ్చర్యపోవడం ఆ యువకుడి వంతైంది. చిన్నప్పుడు మర్మాంగం లేకుండా పుట్టడంతో ఆడపిల్ల అని అలానే పెంచారు తల్లిదండ్రులు. 17 ఏళ్లు వచ్చాక కడుపునొప్పి తీవ్రంగా రావడంతో హైదరాబాద్ ఆస్పత్రిలో చూపించారు..
కానీ ఆస్పత్రిలో నమ్మలేని నిజం వెలుగుచూసింది. అమ్మాయి కాదు అబ్బాయి అని తేలింది. అతడి మర్మాంగాలు లోపలే ఉండిపోయి కడుపునొప్పికి దారితీశాయని డాక్టర్లు ధ్రువీకరించారు. ఆపరేషన్ చేసి అతడి మర్మాంగాలను బయటకు తీశారు.
17 ఏళ్లుగా అమ్మాయిలా భావించి అలా తిరిగిన అమ్మాయి.. ఇప్పుడు అబ్బాయిలా పైంటు షర్ట్ వేసుకుని తిరుగుతుండడం ఊరిలో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇదో విచిత్రం..