
తమిళనాడు శాసనసభాపక్ష నేతగా ఆ రాష్ట్ర ఆర్థిక, ప్రజా పన్నుల శాఖ మంత్రి నియమితులయ్యారు. ముఖ్యమంత్రిగా జయలలిత ఉండగా మరో వ్యక్తిని, మంత్రి అయిన పన్నీర్ సెల్వంను శాసనసభాపక్షనేతగా నియమించడం తమిళ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఎందుకంటే దేశంలోని అన్ని రాష్ట్ర శాసనసభల్లో ముఖ్యమంత్రేయే శాసన సభాపక్ష నేతగా ఉంటారు. అది సంప్రదాయం కూడా. . కానీ తమిళనాట పన్నీర్ సెల్వం అయ్యారు. జయలలిత ఆ పదవి నుంచి వైదొలిగారు..
కాగా దీనికి జయలలిత అనారోగ్యమే కారణమని తెలుస్తోంది.. కొద్ది రోజుల క్రితం దాదాపు నెల రోజులుగా సీఎం జయలలిత సచివాలయం గడప తొక్కలేదు.. పోయేస్ గార్డెన్ లోని ఇంటికే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆమెకు క్యాన్సర్ వచ్చినట్టు ఊహాగానాలు చెలరేగాయి. బీజేపీ నేత సుబ్రహ్మణం కూడా జయ అమెరికాకు చికిత్స కోసం వెళ్తున్నారని ట్విట్టర్ లో పేర్కొన్నారు. దీంతో జయలలిత అనారోగ్యంపై తమిళనాట అభిమానులకు ఆందోళన నెలకొంది.
వీటన్నింటి నేపథ్యంలోనే జయలలిత శాసనసభలో తాను లేకున్నా పన్నీర్ సెల్వం శాసనసభను నడిపించాలనే ఉద్దేశంతో వైదొలిగినట్లు సమాచారం.