Breaking News

అమెరికా విదేశాంగ మంత్రికే ఫైన్

John Kerry concedes to George Bush in 2004

హైదరాబాద్, ప్రతినిధి : మన దేశంలో ప్రధాని , మంత్రులకు రెడ్ కార్పెట్ పరుస్తారు. వాళ్ల ఇంట దగ్గర భారీ సెక్యురిటీ ఏర్పాటు చేస్తారు.. వారు ఇంటి బిల్లు, నల్లబిల్లు కట్టినా కట్టకపోయినా అధికారులు పట్టించుకోరు.. ఇక చెత్తా చెదారం రోడ్డు మీద వేసినా అసలే పట్టదు.. కానీ అమెరికాలో అలా కాదు అమెరికా అధ్యక్షుడైనా రూల్స్ పాటించాలి. లేదంటే ఫైన్ తప్పదు..

అసలు విషయానికి వస్తే ఇటీవల అమెరికాలో భారీ మంచు తుఫాన్ వచ్చింది. అతలాకుతలం చేసింది. రోడ్లపై, కార్లపై మంచు భారీగా పేరుకుపోయింది. 2 అడుగుల మేర పేరుకుపోయిన మంచు అమెరికాలోని చట్టాల ప్రకారం ఎవరి ఇంటి ముందున్న మంచును వారే తీసేయాలి. మున్సిపాల్టీల వాళ్లు కేవలం రోడ్లే శుభ్రం చేస్తారు. ఇక ఇళ్లముందు మంచు తీయని వారికి ఫైన్ లు వేస్తారు. కాగా అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ తన ఇంటిమందు మంచును తొలగించకపోవడంతో అక్కడి అధికారులు ఏకంగా మంత్రికే ఫైన్ వేశారు. దేశ మంత్రిగా ఉండి నిర్లక్ష్యంగా వ్యహరించినందుకు 50 డాలర్ల ఫైన్ వేశారు. తప్పుజరిగినందుకు సారీ అనీ ఆ ఫైన్ కట్టి మంచు తీస్తానని జాన్ కెర్రీ చెప్పారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *