
భారత ప్రధాని ఈసారి నిర్వహించిన అమెరికా పర్యటన చరిత్రలో నిలిచిపోయింది. పారిశ్రామికవేత్తలు, అమెరికా ప్రజలు, వివిధ దేశాధినేతల్లో విభిన్నం గా విలక్షణంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ అందరి మనసులను చూరగొన్నారు. మోడీ మాట్లాడిన ప్రతీ మాట.. ప్రతీ చర్య ఓ వెల్లువలా అందిరిని తాకింది.. 21 వ శతాబ్దం భారత దేశానిదేనని మోడీ సగర్వంగా అమెరికా గడ్డపై ప్రకటించారు. గూగుల్, ఫేస్ బుక్, తదితర దిగ్గజ సంస్థలతో చర్చలు జరిపి భారత్ లో పెట్టుబడులకు ఒప్పించారు.
మేధో వలస భారత్ నుంచి వెళ్లి అద్భుతాలు చేస్తోందని.. వారిని భర్తీ చేసే తరం ఇంకా భారత్ లో ఉందని మోడీ చెప్పారు. ప్రవాస భారతీయులందరూ మాతృదేశం రుణం తీర్చుకోవాలని సూచించారు.
కేవలం 15 నెలల్లోనే భారత్ కొత్త ఆర్థిక శక్తిగా మార్చానని.. పాత అవినీతి వాసనలు లేకుండా పరిపాలిస్తున్నానన్నారు. ఈ సందర్బంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో మోదీ చర్చలు జరిపారు. పలు అంశాలపై చర్చలు జరిపారు. భద్రతామండలిలో భారత శాశ్వత సభ్యత్వానికి ప్రాన్స్, బ్రిటన్, అమెరికాలు మద్దతు తెలిపారు. దీంతో ఈ ఘనత సాధించిన దేశంగా భారత్ ఘనత వహించనుంది..