అమెరికాలో కేటీఆర్ మూడోరోజు పర్యటన

KTR

అమెరికా : కేటీఆర్ మూడో రోజు అమెరికా పర్యటనలో పీట్స్ బర్గ్ లో పర్యటించారు.  అక్కడున్న ఇంక్యూబేటర్ ను పరిశీలించి తెలంగాణ హబ్ కు దీన్ని ఉపయోగించుకుంటామని చెప్పారు. అక్కడున్న మంత్రులు, అధికారులు, పారిశ్రామికవేత్తల తో భేటి అయ్యారు. ప్రపంచమంతా తెలంగాణ రాష్ట్రం వైపు చూసేలా ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. ఇందుకోసం విదేశాల్లో ఉన్న ఎన్నారైలంతా తమతో కలిసి రావాలని కోరారు. ప్రతీ తెలంగాణ  ఎన్నారై ఒక్కో అంబాసిడర్ గా తెలంగాణకు సేవలందించాలని చెప్పారు.  నాలుగేళ్లలో తెలంగాణను మిగులు రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.  ఇందుకోసం ప్రణాళిక బద్దంగా ముందుకెళ్తున్నామన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *