
హైదరాబాద్, ప్రతినిధి : ఈ కామర్స్ సైట్లపై నిఘా ఉంచాలని ఆర్ఎస్ఎస్ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. విదేశీ ఈ-కామర్స్ సైట్లు ‘అమెజాన్’, ‘ఈబే’లను బ్యాన్ చేయాలని వాళ్లు కోరారు. ఫారిన్ సైట్లతో ఇండియాలో బిజినెస్ చేసే వారు నష్టపోతున్నారన్నారు ఆర్ఎస్ఎస్ నేతలు. ఫ్లిప్ కార్ట్ కు ఫారిన్ ఫండ్స్ ఉన్నాయని…దాన్ని కూడా నిషేదించాలని కోరారు.
తాజాగా సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీని ఆర్ఎస్ఎస్ నేతలు కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ కామర్స్ రంగంలో ఎఫ్డీఐలకు తాము పూర్తిగా వ్యతిరేకమని స్వదేశీ జగ్రాన్ మంచ్ లీడర్లు చెప్పారు. చట్టంలో మార్పులు తెచ్చి ఈ కామర్స్ రంగంలో ఫారిన్ పెట్టుబడులను తగ్గించాలన్నారు.