Breaking News

అమిత్ షా ముందు గోడు వెల్లబోసుకున్న కిషన్ రెడ్డి

09AMIT SHAH_0

నిన్న హైదరాబాద్ లో కేటీఆర్ మోడీని తిట్టిని తిట్టు తిట్టకుండా తిట్టి ఎండగట్టాడు. మరో వైపు కాంగ్రెస్ టీడీపీ నేతలు, ఆఖరకు బీజేపీ నేతలు కూడా టీఆర్ఎస్ లో కలిసిపోతున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. జాతీయ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను కలిసి గోడు వెల్లబోసుకున్నాడట.. టీఆర్ఎస్ పార్టీ ఇతర నేతలను బెదిరించి టీఆర్ఎస్ లో చేర్చుకుంటోందని.. సంస్కారం లేకుండా ప్రధాని మోడీని విమర్శిస్తున్నారని వాపోయారట..

దీంతో అమిత్ అధికార పార్టీ బీజేపీ అని.. ప్రాంతీయ పార్టీలకు కాలం చెల్లిందని.. త్వరలోనే మంచిరోజులొస్తాయని ధైర్యం చెప్పారట.. బయటకొచ్చిన కిషన్ రెడ్డి మీడియాతో టీఆర్ఎస్ ఆగడాలను, కేటీఆర్ దుందుడుకు స్వభావాన్ని ఖండిస్తున్నట్టు చెప్పి జారుకున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *