
విజయవాడ : ఏపీ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన శిలాఫలకంపై 16మంది ప్రముఖుల పేర్లను చెక్కించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్, పంజాబ్ సీఎం ప్రకాష్ సింగ్ బాద్ పేర్లు ప్రముఖంగా ఉన్నాయి.. వీరి తర్వాత తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, తమిళనాడు గవర్నర్ రోశయ్య, నాగాలాండ్ గవర్నర్ బాలకృష్ణ ఆచార్య, సుప్రీంకోర్టు జడ్జి ఎన్ వీ రమణ, హైకోర్టు సీజే భోసలే పేర్లు ఉన్నారు.
వీరితో పాటు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్ గజపతిరాజు, నిర్మలా, సుజనాచౌదరి, దత్తాత్రేయల పేర్లతో పాటు సింగపూర్ మంత్రి ఈశ్వరన్, జపాన్ మంత్రి ఇసుకే టకాచీ ఉన్నాయి..