
విజయవాడ: సీఎం కేసీఆర్.. తెలంగాణ ఏర్పడడానికి.. ఏపీ విడిపోవడానికి ప్రధాన కారకుడు.. అంతేకాదు.. ఏపీకి కనీసం రాజధాని కూడా లేకుండా నిర్దయగా మిగిలిపోవడానికి పరోక్ష కారకుడు.. అట్లాంటి కేసీఆర్ కు ఏపీ ప్రభుత్వం, సీఎం చంద్రబాబు అమరావతి శంకుస్థాపనకు రెడ్ కార్పెట్ పరిచాడు. ఇంటికి వెళ్లి ఆహ్వానించాడు.. దీంతో కేసీఆర్ కూడా విజయవాడకు పోతున్నాడు..
అంతా బాగానే ఉన్నా ఇప్పుడు ఏపీ ప్రజలు, టీడీపీ నాయకులు అమరవతి శిలాఫలకంపై కేసీఆర్ పేరు చేర్చడాన్ని తీవ్రంగా ఖండించారు. శిలాఫలకం రాజధాని ఉన్నన్ని రోజులు అంటే శతబ్దాలు అలానే స్థిరపడిపోతుందని.. దీనిపై విభజన కారకుడైన కేసీఆర్ పేరు ఏలా చేర్చుతారంటూ టీడీపీ నాయకులే ప్రశ్నిస్తున్నారు. అధికారులపై మండిపడ్డారట.. కానీ ఇది అంతా ప్రొటాకాల్ ప్రకారమే చేశామని అధికారులు వివరించారు.
కాగా ఏపీ సీఎం చంద్రబాబు కేసీఆర్ కు విశిష్ట అతిథిగా ట్రీట్ చేసి గౌరవిస్తున్నాడని.. దీనిపై తాము, ఏమీ చేయలేమంటున్నారు అధికారులు.. కాగా ప్రొటోకాల్ ప్రకరమే ఇతర రాష్ట్రాల సీఎంలతో పాటు కేసీఆర్ పేరు పొందపర్చడం తప్పనిసరి అని నిర్వాహకులు తెలిపారు.