
ఏపీ రాజధాని అమరావతి నగర శంకుస్థాపనకు తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరుకావాలని నిర్ణయించారు. ఏపీ సీఎం చంద్రబాబు కేసీఆర్ ను ఆహ్వానించేందుకు ఆదివారం స్వయంగా కేసీఆర్ ఇంటికి వెళ్లి ఆయన్ను ఆహ్వానించనున్నారు. ఈక్రమంలో కేసీఆర్ శనివారం రాత్రే అమరావతి వెళ్లడానికి నిర్ణయించుకొని అధికారులు చెప్పారు. దీంతో సీఎం టూర్ షెడ్యూల్ ను అధికారులు రూపొందించారు.
ఏపీ సీఎం చంద్రబాబు నేడు సాయంత్రం 5.30కి సీఎం కేసీఆర్ ఇంటికి వెళ్లనున్నారు. ఈ మేరకు వీరి భేటి ఖరారయ్యింది.. కేసీఆర్ ను కలిసిన తర్వాత చంద్రబాబు రాష్ట్ర గవర్నర్ నరసింహన్, మరికొంత మంది ప్రముఖులను కూడా కలవనున్నారు. కేసీఆర్ ఇంటికి చంద్రబాబు వెళ్లడం ఇదే ప్రథమం.. అంతకు ముందు గవర్నర్ నివాసంలో వీరిద్దరు కలిసి మాట్లాడారు.