
ఏపీ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన ఘనంగా జరిగింది.. అతిరథ మహామహులు హాజరైన ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా నూతన రాజధాని శిలాఫలకం ఆవిష్కరించారు. ప్రధాని నరేంద్ర మోడీ తెలుగు లో ప్రసంగం మొదలుపెట్టి తెలుగు రాష్ట్రాలు అభివృద్ధికి సహకరిస్తానని తెలిపారు. వేదికపై తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, చంద్రబాబు అనోన్యంగా ఉండడం రెండు రాష్ట్రాల ప్రజల కంటికి ఇంపుగా అనిపించాయి..
ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, గవర్నర్లు నరసింహన్, రోశయ్య, సీఎంలు చంద్రబాబు, కేసీఆర్, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, దత్తాత్రేయ, అశోక్ గజపతిరాజు, సుజనాచౌదరి, ఏపీ తెలంగాణ మంత్రులు, టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.