‘అమరావతి’ నగర అపురూప రాజధాని

‘అమరావతి’ నగర అపురూప దృశ్యాలు అని మనం ‘మా తెలుగు తల్లి’ పాటలో పాడుకుంటాం. కానీ ఇప్పుడు అదే అమరావతి పేరు ఏపీ రాజధానిగా మారింది. సీఎం చంద్రబాబు ఏపీ నూతన రాజధానికి అమరావతి అని పేరు పెట్టారు. ఐదు కోట్ల మంది ఆశల రాజధానికి అచ్చ తెలుగు నామకరణం చేయడంతో ప్రజల్లో సంతోషం వ్యక్తం అవుతోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి బుధవారం ఏకగ్రీవంగా తీర్మానించింది.

అమరావతి పేరు ఆంధ్రుల గత వైభవానికి ప్రతీక. అంతటి మహోన్నతమైన అమరావతి చారిత్రక విశేషాలున్న పేరును ఖరారు చేశారు. దీంతో పాటు ఆధునిక రాజధానిని నిర్మించేందుకు సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం ఖరారైంది. మంత్రిమండలి సింగపూర్ ప్రభుత్వం అందజేసిన మాస్టర్ ప్లాన్ ను ఆమోదించారు. మరో ఆరు నెలల్లో నిర్మాణ పనులు మొదులు కానున్నాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *