అభ్యర్థుల సెల్ ఫోన్లకే ఉద్యోగ సమాచారం

-TSPSC ద్వారా కొత్త ప్రయోగం.. -నిరుద్యోగులు నమోదు చేసుకోవాలి

హైదరాబాద్ : TSPSC ఏర్పాటు కోసం ఎన్నాళ్లనుంచో ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కళ నెరవేరింది. శనివారం గవర్నర్ నరసింహన్ చేతుల మీదుగా TSPSC వెబ్ సైట్ ఆరంభమైంది.  TSPSC నిరుద్యోగులకు సులభమైన పద్ధతిలో రిజిస్ర్టేషన్, దరఖాస్తు ప్రక్రియను ప్రవేశపెట్టింది. ఎంతో అడ్వాన్స్ సిస్టమ్ తో ఒక్కసారి నమోదు చేసుకుంటే అభ్యర్థి అర్హతల ఆధారంగా TSPSC యే సమాచారం ఇస్తుంది.

ఆదివారం నుంచి అభ్యర్థులు www.tspsc.gov.in ద్వారా తమ విద్యార్హతల సమాచారాన్ని నమోదు చేసుకోవాలి. ఇది నెట్ బ్యాంకింగ్ తరహాలో పనిచేస్తుంది. ఇది ఉచితంగా అభ్యర్థులకు TSPSC అందజేస్తోంది. ఉద్యోగాలకు అప్లై చేసుకునేటప్పుడు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న సమాచారాన్ని ఆప్లికేషన్ కు అనుసంధానం చేసుకుంటే సరిపోతుంది. ఒక్కసారి తమ వ్యక్తిగత  అర్హతల ఆధారంగా సమాచారాన్ని వెబ్ సైట్ లో పొందుపరుచుకుంటే ఓ పాస్ వర్డ్ , మెయిల్ కు , సెల్ ఫోన్ కు వస్తుంది. 

కాగా కొత్తగా వెబ్ సైట్ కు అనుసంధానం ఫేస్ బుక్ పేజిని పెడతామని.. దాని ద్వారా కూడా ఉద్యోగార్థులు ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకోవచ్చని TSPSC చైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *