అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై పంచాయతీరాజ్ శాఖా మంత్రి, ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష సమావేశం

వరంగల్ : వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై పంచాయతీరాజ్ శాఖా మంత్రి, ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. హన్మకొండలోని అంబేడ్కర్ ఆడిటోరియంలో ఈ సమావేశం మొదలైంది. ఈ సమావేశానికి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్ హాజరు అయ్యారు.

ప్రపంచంలోనే అతిపెద్ద దైన కాళేశ్వరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసి జాతికి అంకితం చేయడంపై అపర భగీరథుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ కు సమావేశానికి హజరైన మంత్రులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.

రాష్ట్ర పంచాయతీ రాజ్,గ్రామీణాభివృద్ధి మరియు  గ్రామీణ నీటి సరఫరా శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ ప్రసంగించారు

ఎన్నో పోరాటాలు ,త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం లో ప్రతీ జిల్లా..ప్రతి అంశం లో అభివృద్ధి కావాలన్నారు. క్షేత్ర స్థాయి వరకు సంక్షేమ ఫలాలు అందరికి అందాలన్నారు.

హరితహారం లో అనుకున్న సక్సెస్ కాలేదు. ప్రజలు కోరుకునే చెట్లు నాటేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ప్రతి డిపార్ట్మెంట్ అధికారులు ఈ కార్యక్రమం లో పాల్గొనాలన్నారు. భారతదేశం లోనే హరితహారం కి గొప్ప పేరు రావాలన్నారు.

పట్టాదారు పాస్ బుక్ లు 80 శాతం ఇచ్చారు. చాలా చోట్ల ఇబ్బంది కరమైన పరిస్థితులు ఉన్నాయన్నారు.

పోడు భూముల పైన సమస్యలను తీర్చాలన్నారు. అధికారులు చాకచక్యంగా వ్యవహరించాలని వ్యాఖ్యానించారు.

ఆరు జిల్లా లోని అన్నీ గ్రామాలు ఓడిఎఫ్ గ్రామాలు అయ్యేందుకు కృషి చేయాలన్నారు.
రైతులకు ప్రభుత్వం అన్నీ రకాలుగా సహకరిస్తుందన్నారు. అగ్రీ కల్చర్ అధికారులు రైతులకు ఎప్పటికప్పుడు సలహా లను ఇవ్వాలన్నారు.
పెంచిన ఆసరా పెన్షన్ లను జులై 1st నుండి పంపిణీ చేయనున్నాం అని చెప్పారు.
ఇంకా కొన్ని ప్రభుత్వ పాఠశాలలు మెరుగు పడాలన్నారు. బడి ఈడు పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాల లో చదివేల చైతన్యం రావాలన్నారు.
మంజూరు అయిన రెండు పడక గదుల నిర్మాణం త్వరగా పూర్తి చేయలన్నారు.
దేవాదుల కి భూమి సేకరణ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.

దేశం లో ఎక్కడలేని విధంగా,ఎవరూ చేయలేని విధం గా అతి తక్కువ వ్యవధిలో కాళేశ్వరం ని మన ముఖ్యమంత్రి పూర్తి చేశారు. దీని ద్వారా మొదలు లాభపడేది మన వరంగల్ జిలా నే అన్నారు.

ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి పక్క ప్రణాలికను తయారు చేసుకుందామని అన్నారు.  ప్రతి మూడు నెల లకి రివ్యూ చేసుకుందామని అన్నారు.

errabelli dayakar rao 1     errabelli dayakar rao 2     errabelli dayakar rao 2     errabelli dayakar rao 3

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *