అభివృద్ధి, సంక్షేమమే టీఆర్ఎస్ లక్ష్యం

అభివృద్ధి, సంక్షేమమే టీఆర్ఎస్ లక్ష్యం

-పాలకుర్తి టీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు
పాలకుర్తి ప్రజల అభివృద్ధి, సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని పాలకుర్తి పార్టీ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ రూరల్ రాయపర్తి మండలం కొలాన్ పల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహిళలు మంగళ హారతులు, కోలాటం, ఆటపాటలు, బతుకమ్మలు, బోనాలతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు సార్లు గెలిపించిన పాలకుర్తి ప్రజలు మరోసారి పట్టం కట్టేందుకు సన్నద్దమవుతున్నారని, ఎన్నికల్లో కాంగ్రెస్ డిపాజిట్లు గల్లంతవ్వడం ఖాయమని అన్నారు. రాబోయే రోజుల్లో పాలకుర్తిని రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుపుతానన్నారు. సాగు, తాగు నీటి సమస్యల శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలోని భూములు సస్యశ్యామలం కానున్నాయన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా చేస్తానన్నారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ నర్సింహనాయక్, మండల పార్టీ అధ్యక్షుడు అనిమిరెడ్డి, జడ్పీటీసీ, ఎంపీపీ, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

errabelli dayakar rao 1     errabelli dayakar rao 2     errabelli dayakar rao 3     errabelli dayakar rao 4     errabelli dayakar rao 5

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *