అభివృద్ధి చేసి ‘గ్రేటర్’ పీఠం కొడదాం..

అభివృద్ది నినాదమే.. మా వాదం అంటున్నారు సీఎం కేసీఆర్.. గెలిచాక అభివృద్ధి చేస్తామనడం కంటే.. అభివృద్ది చేసిన తర్వాతే జనాల్ని  ఓట్లడగడం మేలు అని భావిస్తున్నారు. ఇప్పుడు సీఎం ఫోకస్ మొత్తం గ్రేటర్ హైదరాబాద్ పై ఉంది. వచ్చే 8 నెలల్లో గ్రేటర్ ఎన్నికలు నిర్వహిస్తామని హైకోర్టు కు తెలిపిన ప్రభుత్వం ఈ కాలంలోనే హైదరాబాద్ స్వరూప స్వభావాలను పూర్తిగా మార్చేసేందుకు ప్లాన్ లు రెడీ చేస్తోంది. శుక్రవారం హైదరాబాద్ మహా నగర పాలక, నగరాభివృద్ధి సంస్థ, జలమండలి కీలక అధికారులు, నగరానికి చెందిన మంత్రులు మహమూద్ అలీ, నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, తలసాని శ్రీనివాస యాదవ్ లతో దాదాపు ఏడు గంటలపాటు హైదరాబాద్ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు.

విశ్వనగరంగా హైదరాబాద్

హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళికలు అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని.. ప్రధానంగా తాగునీటి సమస్య తీర్చాలని.. మొత్తం 150 డివిజన్ల సమస్యలు తీర్చాలని ఆదేశించారు. స్వల్ప, దీర్ఘకాలిక సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు. ముఖ్యంగా నగరంలోని ట్రాఫిక్ సమస్య తీర్చడానికి యుద్ధ ప్రాతిపదికన పనిచేయాలని.. ఫైఓవర్ల నిర్మాణాలను చేయాలని ఆదేశించారు. పాతబస్తీ రూపు రేఖలు మార్చాలని,  మూసీ కాలుష్యాన్ని కడిగి పారేయాలని ఆదేశించారు.

డివిజన్ల పర్యటనకు సీఎం

హైదరాబాద్ లోని డివిజన్లలో పర్యటించాలని సీఎం నిర్ణయించారు. ఒక్కో డివిజన్ లో పర్యటిస్తూ వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తానని చెప్పారు. అలాగే  నగర పరిధిలో రోడ్లను వెడల్పు చేయాలని.. 50 వేల జనాభాకు ఒక మార్కెట్ ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

గ్రేటర్ ఎన్నికలు జరగడానికి ముందే హైదరాబాద్ ను అభివృద్ధి చేసి, శాంతి భద్రతలను బాగు చేసి, ప్రజలకు మౌళిక సదుపాయాలు కల్పించి ఓట్లడుగుతామని.. అప్పుడే గ్రేటర్ పీఠాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకోగలుగుతుందని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *