అభివృద్ధి చేశా ఆశీర్వదించండి

అభివృద్ధి చేశా ఆశీర్వదించండి

– తాజా మాజీ తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్
నాలుగున్నరేళ్లలో ధర్మపురి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని, మరోసారి ఎన్నికల్లో ఆశీర్వదించాలని తాజా మాజీ తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ అన్నారు. గొల్లపల్లి మండలం తిరుమలపూర్, బీంరాజ్ పల్లి, బొంకూర్, వెనుగుమాట్ల శంకరవుపేట మల్లన్నపేట, రాఘవపట్నం, గంగదేవిపల్లి, అగ్గిమల్ల, గుంజేపడుగు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ తోనే తెలంగాణ సస్యశ్యామలమవుతుందన్నారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓటేసి మరోసారి గెలిపించాలని కోరారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన పాక్షిక మేనిఫెస్టోతో కాంగ్రెస్ నేతలు బెంబేలెత్తుతున్నారన్నారు. బడుగుబలహీన వర్గాల అభివృద్ధి టీఆర్ఎస్ తోనే సాధ్యమవుతుందన్నారు. మరోసారి టీఆర్ఎస్ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులను తరిమికొట్టాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని, గత ప్రభుత్వాలు అభివృద్ధిని విస్మరించాయని అన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణలోని అన్ని కులాలకు సముచిత స్థానం కల్పిస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

koppula eshwar 1     koppula eshwar 2     koppula eshwar 3

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *