అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మిషన్ భగీరథ లాంటి ప్రాజెక్టు ఎక్కడా లేదు

మిషన్ భగీరథ సోషల్ ప్రాజెక్టు కాదు ఎకనామికల్ ప్రాజెక్టు అన్నారు ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా. ఇంటింటికి సురక్షిత మంచినీటిని అందించే మిషన్ భగీరథతో సమాజానికి కలిగే ఆర్థిక ప్రయోజనాలు వెలకట్టలేనివన్నారు. పలు మర్చంట్ బ్యాంకు ప్రతినిధులతో సచివాలయంలో సమావేశమైన సందీప్ కుమార్  సుల్తానియా, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మిషన్ భగీరథ లాంటి ప్రాజెక్టు ఎక్కడా లేదన్నారు. తెలంగాణలోని ప్రతీ గడపకు రక్షిత మంచినీటిని అందించడమే తెలంగాణ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక పారిశ్రామిక విధానాలతో రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకెళ్తుందన్నారు.అందుకే మిషన్ భగీరథకు రుణాలు ఇచ్చేందుకు జాతీయ బ్యాంకులు పోటీ పడ్డాయని చెప్పారు. అంతకుముందు బ్యాంకర్లకు మిషన్ భగీరథ లక్ష్యాలను RWS&S ఈ.ఎన్.సి సురేందర్ రెడ్డి వివరించారు. ఉపరితల నీటి వనరులతో ప్రజలకు తాగునీటిని అందించాలన్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పాన్ని కేంద్రంతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థలు మెచ్చుకున్నాయన్నారు. ఇంటింటికి నల్లాతో పాటు ఇంటర్ నెట్ కనెక్షన్ ఇవ్వడం దేశంలో ఎక్కడా లేదన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు గారి నిరంతర పర్యవేక్షణ సలహాలు సూచనలతో రాష్ట్ర వ్యాప్తంగా భగీరథ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ఈ మార్చి నాటికి హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ పరిధిలోని 9 నియోజకవర్గాల్లోని ఆవాసాలకు సురక్షిత మంచినీటిని అందిస్తామన్నారు. ఈ సంవత్సరం చివరి నాటికి రాష్ట్రంలోని అన్ని అవాసాలకు రక్షిత మంచినీటిని సప్లై చేస్తామన్నారు. అందుకు అనుగుణంగా సమగ్ర యాక్షన్ ప్లాన్ తో ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయన్నారు. ఈ సందర్భంగా ప్రైవేటు బ్యాంకు ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఈఎన్ సి సమాధానమిచ్చారు. తెలంగాణ ప్రజల ప్రాజెక్టు ఐన మిషన్ భగీరథలో భాగం కావాలని బ్యాంకర్లను కోరారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి రామ్మోహన్, సంయుక్త కార్యదర్శి సాయి ప్రసాద్ తో పాటు ఐసిఐసిఐ, కోటక్ మహేంద్ర, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్.బి.ఐ లకు చెందిన మర్చంట్ బ్యాంకు ప్రతినిధులు హాజరయ్యారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *