
-తాజా మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు
ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి పాలకుర్తి అభివృద్ధికి అండగా నిలవాలని పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూర్, ఈరవెన్ను గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందదర్భంగా గ్రామాల్లో మహిళలు మంగళహారతులు, కోలాటం ఆటపాటలు, బతుకమ్మలు, బోనాలు, డప్పుచప్పుళ్లు, ఒగ్గుడోళ్లతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గాన్ని రాష్ట్ర్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు. టీఆర్ఎస్ హయాంలో చేపట్టిన అభివృద్ధిని, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఎన్నికల్లో కారుగుర్తుకు ఓటేసీ భరీ విజయాన్ని అందించాలని కోరారు పాలకుర్తి అభివృద్ధి విషయంలో ప్రణాళిక బద్దంగా వెళ్తున్నానని, నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు సాగు, తాగు నీరు మౌలిక వసతుల కల్పన ధ్యేయమని అన్నారు. గ్రామాల్లో అంతర్గత రోడ్లు వేయించేందుకు కృషి చేశానన్నారు. రానున్న రోజుల్లో అన్ని గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. మండల కేంద్రాల్లో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, ప్రతీ చెరువుకు గోదావరి జలాలు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. ఎంపీపీ, మండల పార్టీ అధ్యక్షుడు నల్ల నల్లనాగిరెడ్డి, వ్యవసకమిటీ చైర్మన్ రాంబాబు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.