అభివృద్దే ధ్యేయంగా పునరంకితం కావాలి

కరీంనగర్: కరీంనగర్లో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ దేశ సౌభాగ్యం కొరకు, దేశానికి స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన ఎందరో అమర వీరులను స్మరిస్తూ ప్రతి ఒక్కరూ అభివృద్ధిలో పునరంకితం కావాలని అన్నారు. ఒక రాష్ర్టం అభివృద్ధి చెందాలంటే గ్రామాల అభివృద్ధి చెందాలని అన్నారు. గ్రామాల అభివృద్ధికే రాష్ర్ట ప్రభుత్వం గ్రామ జ్యోతి పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఎందరో అమరవీరుల త్యాగ ఫలంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని అందులో భాగంగానే రైతులకు సబ్సిడిలను అందించి, పంట రణాల మాఫీ ద్వారా రైతులను ఆదుకుందని తెలిపారు. జిల్లాలో మరిన్ని పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గర్భిణులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు అంగన్వాడీ సిబ్బందికి ఎన్నడూ లేని విధంగా జీత భత్యాలను పెంచిన ఘనత ప్రభుత్వానికే దక్కిందన్నారు. షీ టీంల ద్వారా మహిళలపై జరుగుతున్న అక్రమాలను అరికట్ఠనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ నీతు కుమారి, ఎస్సీ డెవిడ్ జోయిల్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కరీంనగర్ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఈద శంకర్ రెడ్డి, కరీంనగర్ మండల పరిషత్ అధ్యక్షులు వాసాల రమేష్, డిపిఆర్ఓ ప్రసాద్, జిల్లా అధికారులు, పలువురు నాయకులు, కార్పొరేటర్లు, వివిధ పాఠశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.