అభివృద్ది పనులకు ఈటల శంకుస్థాపన

ambala

కరీంనగర్ : తెలంగాణ ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ నిన్న తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్ లో పర్యటించారు. కమలాపూర్ మండల కేంద్రం నుంచి అంబాలకు రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.

ambala2

 

రోడ్డు సౌకర్యంతోనే గ్రామాలు సమగ్రాభివృద్ది సాధిస్తాయని అన్ని గ్రామాలకు మట్టిరోడ్డు లేని తారు రోడ్లను నిర్మిస్తామని ఈటల అన్నారు. 7 కోట్ల 55 లక్షలతో మంజూరైన డబుల్ రోడ్డుకు, 8 కోట్లతో మంజూరైన కానిపర్తి, బావుపేట డబుల్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా రోడ్దును 6 నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తెస్తామని, తెరాస సర్కారు వేగంగా గ్రామాలకు రోడ్ల నిర్మాణాలు చేపడుతోందని చెప్పారు. స్థానిక నాయకులు, అదికారులు పాల్గొన్నారు.

 

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *