Breaking News

అబ్బాయితో బాబాయ్ సినిమా..!

pawan_chiru

– రాంచరణ్ ను హీరోగా పెట్టి సినిమా తీస్తున్న పవన్

హైదరాబాద్, ప్రతినిధి : చిరంజీవి ఫ్యామిలీతో వచ్చిన విభేదాలను పరిష్కరించేపనిలో పడ్డారు పవర్ స్టార్ పవన్ కళ్యాన్.. అందుకే అబ్బాయి రాంచరణ్ తో సినిమా తీసేందుకు పవన్ కళ్యాన్ ప్లాన్ చేస్తున్నాడు. పవన్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు ఈ రోజు పవన్ కార్యాలయం నుంచి ఒక ప్రెస్ నోట్ విడుదలైంది. రాంచరణ్ తో సినిమా తీసేందుకు బాబాయి పవన్ ముందుకురావడం.. దానికి చెర్రీ ఒప్పుకోవడం చూస్తుంటే ఇరు ఫ్యామిలీలు కలిసిపోయేనట్టే కనిపిస్తున్నాయి..

గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో చిరంజీవి ఉన్న కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పవన్ జనసేన స్థాపించి బీజేపీ కి మద్దతు పలకడం ఇరు ఫ్యామిలీల మధ్య దూరాన్ని పెంచింది. ఇప్పుడు రాజకీయ వేడి తగ్డడంతో అన్నదమ్ములు చిరు పవన్ లు కలిసిపోతున్నారు.. అందుకే చెర్రీ సినిమానే పవన్ పావుగా వాడుకుంటున్నట్టు టాక్.. ఇది జనాలకు తెలిపేందుకేనని గుసగుసలు వినపడుతున్నాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *