అప్పుల ఊబికి దగ్గరలో అమెరికా

అమెరికా ఖజానా ఖాళీ అవుతోంది.. వచ్చే నెల 3వ తారీఖు తర్వాత ప్రభుత్వ ఖజానాలో డబ్బులు నిండుకుంటాయి.. చెల్లింపులు చెల్లించలేక ఒబామా ప్రభుత్వం చేతులెత్తనుంది.. అమెరికా ట్రెజరీ కార్యదర్శి జాకబ్ ల్యు ఈ మేరకు అమెరికన్ కాంగ్రెస్ కు లేఖ రాశారు.. నవంబర్ 3లోపు ప్రభుత్వ రుణపరిమితి పెంపుదలకు కాంగ్రెస్ అనుమతించకుంటే ప్రభుత్వ ఖజానా ఖాళీ అవుతుందని ఆయన హెచ్చరించారు.

ప్రస్తుతం నవంబర్ 3 తర్వాత యూఎస్ ఖజానాలో 3000 కోట్ల డాలర్ల కన్నా తక్కువ నగదు ఉంటుందని.. ఇది అమెరికా అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి దారితీస్తుందని కార్యదర్శి లేఖ రాశారు. కాగా దీనిపై ఒబామా అమెరికన్ కాంగ్రెస్ కు విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష రిపబ్లికన్లకు మెజార్టీ ఉండడంతో రుణపరిమితిని పెంచాలని వేడుకుంటున్నారట..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *