అప్పుడొచ్చిన సంతోషం.. ఇప్పుడు అయ్యింది..

మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందం చారిత్రాత్మకమైనదని.. తెలంగాణ సాధించినప్పుడు కలిగిన ఆనందం మళ్లీ ఈ ప్రాజెక్టుల ఒప్పందంలో తనకు కలిగిందని సీఎం కేసీఆర్ అన్నారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తో ముంబైలో గోదావరి, ప్రాణహిత, పెన్ గంగా నదులపై ఐదు బ్యారేజీలు నిర్మించేందుకు కేసీఆర్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ తిరిగొచ్చిన కేసీఆర్, మంత్రుల బృందానికి టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం సీఎం, మంత్రులు భారీ ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ కృష్ణ, గోదావరి నదులపై నిర్మించే ప్రాజెక్టులతో తెలంగాణలో కోటి ఎకరాలకు నీరు అందిస్తామని తెలిపారు. త్వరలో గ్రేటర్ ప్రజలకు 24 గంటలూ తాగునీరు అందిస్తామని చెప్పారు. బంగారు తెలంగాణ సాధించేవారు కేసీఆర్ నిద్రపోరని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *