అపర భగీరథుడి చారిత్రక ఒప్పందం

నాలుగు దశాబ్దాలుగా ముందుకు సాగని గోదావరి ప్రాజెక్టులకు ఎట్టకేలకు మోక్షం లభించింది.. సీఎం కేసీఆర్ మహారాష్ట్ర కు వెళ్లి అక్కడి సీఎం ఫడ్నవీస్ తో ఇవాళ మధ్యాహ్నం చారిత్రక ఒప్పందం చేసుకున్నారు. తెలంగాణ బృందం , మహారాష్ట్ర సీఎం, అధికారులతో సమావేశమై ఈ మేరకు చారిత్రక ఒప్పందం చేసుకున్నారు.

ఈ ఒప్పందంలో భాగంగా గోదావరిపై ఐదు ప్రాజెక్టులు కట్టనున్నారు. మేడిగడ్డ, ప్రాణహిత చేవెళ్లలో చేపట్టిన తుమ్మిడి హెట్టి, పెన్ గంగాపై నిర్మిస్తున్న చనాఖా-కొరాటా, రాజుపేట, పెన్ పహాడ్ ప్రాజెక్టులు నిర్మించనున్నారు. గోదావరి జలాల వినియోగం, పునరాకృతి విభాగాలపై అంతరాష్ట్ర మండలిని ఏర్పాటు చేసి నీటి కేటాయింపుల బాధ్యతను దానికే అప్పగిస్తారు.

ఈ చారిత్రక ఒప్పందంపై ఇవాళ సీఎంలు కేసీఆర్-ఫడ్నవీస్ లు ఒప్పందం చేసుకున్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అపర భగీరథ ప్రాజెక్టులకు మార్గం సుగమం అయ్యింది. సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టులను పూర్తి చేస్తే చరిత్రలో అపర భగీరథుడిగా మిగిలిపోనున్నారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *