
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ, అగ్రకుల జాడ్యం జడలు విప్పంది.. ఉత్తరప్రదేశ్ లోని సంక్రోట్ గ్రామం ఢిల్లీకి 30కి.మీల దూరంలో ఉంటుంది. ఆ గ్రామంలో జాట్ అనే అగ్రకుల అమ్మాయిని.. దళిత యువకుడు ప్రేమించాడు. అనంతరం ఇంట్లో వాళ్లు ఒప్పుకోక అమ్మాయికి వేరే పెళ్లి చేసి పంపారు. కానీ అమ్మాయి ఆ అబ్బాయినికి నచ్చక దళిత యువకుడి దగ్గరకు లేచిపోయి వచ్చింది. అనంతరం దళిత యువకుడినే పెళ్లి చేసుకుంది. ఆగ్రహించిన గ్రామ పంచాయతీ.. జాట్ అగ్రకులస్థులు ఆ దళిత యువకుడిపై మాదక ద్రవ్యాల కేసు పెట్టి మీరట్ జైల్లో వేయించారు.
దళిత యువకుడి ఇద్దరు చెల్లెల్లను గ్రామస్థులు రేప్ చేయాలని తీర్పునిచ్చాడు. దీంతో బిక్కుబిక్కుమంటూ ఆ కుటుంబం ఢిల్లీకి పారిపోయింది. దీనిపై కుటుంబం సుప్రీంలో కేసు వేసింది. సుప్రీం తీర్పు ఇచ్చిన ఆ పంచాయతీ పట్టించుకోక వీరి కోసం వెతుకుతోందట.. ఉత్తర ప్రదేశ్ లో పోలీసులు, ప్రభుత్వం, ప్రజాస్వామ్యం ఉందా అనే ప్రశ్న తలెత్తుతోంది..