
జక్కన్న తాను తన సిినిమా విషయంలో… మిగతా వ్యక్తి గత జీవితంలో అన్నీ సాధించానని.. కానీ కోట్లు పెట్టి తీసిన సినిమా విషయంలో మాత్రం విడుదలైన తర్వాత పైరసీని అరికట్టలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు..
బాహుబలికి ముందు హైకోర్టుకు వెళ్లి.. పోలీసులకు ఫిర్యాదు చేసి సకల చర్యలు తీసుకున్నా దాన్ని అరికట్టలేకపోయామని.. హిందీ వెర్షన్ విడుదలైన తర్వాత 2 రెండు రోజులకే వెబ్ సైట్లలో బాహుబలి పెట్టడంపై తాను నిర్వేదం చెందానని తెలిపారు. ఇండియాలో వ్యవస్థలను మార్చడం.. పైరసీని అరికట్టడం.. చట్టాలను సమర్థవంతంగా అమలుచేయడం కష్టమన్నారు. అది జరిగితే పెద్ద జోక్ జరిగినట్టేనని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు.