అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి ఎర్రబెల్లి

తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమమే ద్యేయంగా ప్రభుత్వం కృషిచేస్తుందని పంచాయతీరాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
* స్టేషన్ ఘన్పూర్ మండలం మీదికొండ గ్రామంలో 33/11కేవి సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
* విద్యుత్ రంగంలో పురోగతి సాధించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కింది.
* నిరంతర నాణ్యమైన విద్యుత్ అందించి రైతాంగాన్ని ఆదుకున్న మహానీయుడు ముఖ్యమంత్రి కేసీఆర్.
* గత ప్రభుత్వ హాయాంలో విద్యుత్ కోతలతో రైతులు పడ్డ కష్టాలను గుర్తుచేశారు.
* గ్రామాల్లో చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
* సర్పంచ్, ఉప-సర్పంచ్ ల జాయింట్ చెక్ పవర్ విషయంలో రాద్దాంతం తగదన్నారు.
* అధికారులు, గ్రామ ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
* 60 రోజుల ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టి గ్రామాల్లో హరితహారం, పారుశుద్ధ్యం కార్యక్రమాలను చేపట్టాలని కోరారు.
* గ్రామ పారుశుద్ధ్య కార్మికులకు వేతనాలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

errabelli dayakar rao 1

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *