అన్ని పథకాలకు ఆధార్ లింక్ కోసం బిల్లు

యూపీఏ తెచ్చిన ఆధార్ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం చట్టబద్దం చేసింది. లోక్ సభలో బిల్లు పెట్టి ఆమోదించింది. రాజ్యసభలో కూడా ఆమోదం పొందితే ఇక దేశంలో ఆధార్ తోనే అన్ని లింక్ అవుతాయన్నమాట.. దేశంలోని ప్రతి వ్యక్తికి ఆధార్ తప్పనిసరి. ఈ ఆధార్ లేకుంటే ఇక ప్రభుత్వ పథకాలు అందవు.. దరి చేరవు.. ఆధార్ ను ప్రభుత్వ పథకాలకు అనుసంధానించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నించాయి..కేంద్రప్రభుత్వం ఈ మేరకు ఆధార్ ను చట్టబద్ధం చేస్తూ బీజేపీ ప్రభుత్వం చట్టం తెస్తోంది.సుప్రీం కోర్టులో ఆధార్ పై ప్రజాప్రయోజనాలు ఎన్నో దాఖలయ్యాయి. ఆధార్ ను ప్రభుత్వ పథకాలకు అనుసంధానం చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని సుప్రీం ను కోరారు. ఈ విషయంలో ఆధార్ తప్పనిసరి కాదని సుప్రీం కేంద్ర ప్రభుత్వానికి అల్టీమేటం జారీ చేసింది.

కాగా ఆధార్ తో అనుసంధానం వల్ల కేంద్రానికి 15వేల కోట్లు , నాలుగు రాష్ట్రాలకు 2300కోట్లు ఆదా అవుతున్నాయని.. సుప్రీంలో ఆధార్ పై తీర్పు రావడంతో ఈ చట్టం తెస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. లోక్ సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు రాజ్యసభలో కూడా ఆమోదం పొందితే ఇక ప్రతీ పథకానికి ఆధార్ తప్పనిసరి కానుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *