అన్నిపార్టీల్లో టీడీపీ అరువు నాయకులే..

-ఒకరుపోతే 100మందిని తయారుచేస్తా.. *నాయకుల తయారీ కర్మాగారం టీడీపీ -మహబూబ్ నగర్ సభలో చంద్రబాబు గర్జన

tdp cm2

మహబూబ్ నగర్ : ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పార్టీల్లో ఉన్న వారందరూ టీడీపీ నుంచి అరువు తెచ్చుకున్న నాయకులే ఉన్నారని.. ఒక్క నేత టీడీపీ నుంచి పోతే 100మందిని తయారు చేసుకుంటామని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మహబూబ్ నగర్ లో నిర్వహించిన టీడీపీ బహిరంగ సభలో సీఎం చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. టీడీపీని దెబ్బతీయడం ఎవరి వల్లా కాదని స్ఫష్టం చేశారు. టీడీపీని కంటికిరెప్పలా కాపాడుకున్న కార్యకర్తలకు శిరస్సు వంచి పాదాబివందనం చేస్తున్నానని తెలిపారు. నాయకులను టీడీపీ యే తయారు చేస్తుందని.. టీడీపీ ఒక తయారీ ఫ్యాక్టరీ అని అన్నారు.

tdp cm23

తాను ఏపీ సీఎంగా చేసిన అభివృద్ధి వల్లే ఈనాడు తెలంగాణ ధనిక రాష్ట్రం అయ్యిందని తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *