అన్నింటా గెలిపించి సిద్దిపేటలో ఏంటిలా..?

మంత్రి హరీష్ రావు ఇప్పుడు కత్తిమీద సాముచేస్తున్నాడు. అదేంటి తెలంగాణలో ఏ ఎన్నికనైనా తన రాజకీయ వ్యూహరచనతో వార్ వన్ సైడ్ చేసే హరీష్ కు సిద్ది పేట మున్సిపల్ ఎన్నికల్లో ఎందుకు అన్ని కష్టాలు వచ్చాయి అని అనుకుంటున్నారా.. అదే అభిమానం.. ప్రేమకు హరీష్ రావును సిద్దిపేటలో ముప్పుతిప్పలు పెడుతోందట..

సిద్దిపేటలో 2004నుంచి హరీష్ వరుసగా గెలుస్తూ అక్కడి ప్రజల ఆధరాభిమానాలు పొందుతున్నారు. అక్కడ కాంగ్రెస్, టీడీపీ సహా ఏ పార్టీ గెలిచే పరిస్థితి లేదు.. హరీష్ అన్న, టీఆర్ఎస్ అన్న అక్కడి ప్రజలు చాలా ప్రేమ చూపుతారు. ఇప్పుడు అదే ప్రేమ ఆయనకు చిక్కులు తెచ్చిపెట్టింది.

సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో నగరా మోగడంతో అక్కడి 34 వార్డులకు 100కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయట.. వారంతా టీఆర్ఎస్ నాయకులేనట.. సో ఎవరిని వద్దనలో, ఎవరిని అభ్యర్థిగా నిలపాలో తెలియక హరీష్ ఇబ్బందులు పడుతున్నారట.. ఎందుకంటే అందరూ హరీష్ గెలుపుకు సిద్దిపేటలో దోహదపడినవారే.. తన కోసం పనిచేసిన వారిని ఇప్పుడు ఎన్నికల్లో నిలబడడంతో ఎవరికి మద్దతివ్వాలో తెలియక. వారిని విరమింపచేసేందుకు హరీష్ బాగా శ్రమిస్తున్నారు. 34 వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించడం ఇప్పుడు ఆయనకు కత్తిమీద సాములా మారింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *